Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2015 10:29:29
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకటి 'విశ్వరూపం 2' కాగా, మరొకటి 'ఉత్తమ విలన్'. ఈ రెండింటిలోనూ కూడా 'ఉత్తమ విలన్' ముందుగా విడుదల కానుంది. వచ్చే ఏప్రిల్ 2న దీనిని విడుదల చేయడానికి నిర్మాత లింగుసామి సన్నాహాలు చేస్తున్నట్టు చెన్నయ్ సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహిస్తారు. ప్రముఖ నటుడు, కమల్ స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ రెండు పాత్రలు పోషించాడు. ఇందులో దిగ్గజ దర్శకులు కె. బాలచందర్, కె. విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించడం మరో విశేషం. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు.

,  ,  ,  ,  ,