Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 11:20:26
facebook Twitter Googleplus
Photo

ఒక మనసు సినిమా పై కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా చూస్తుంటే చాలా హాయిగా ఉందని చాలామంది అన్నారు. ఎలాంటి గందరగోళాలు, టెన్షన్స్ లేకుండా సాఫీగా సాగిపోయిందని మెచ్చుకున్నారు. నిహారిక కాటన్ చీరలు, చుడీదార్లతో అందంగా కనిపించిందని తెలిపారు. అయితే హీరోయిన్ నీహారిక ఈ సినిమాలో కట్టిన చీరలపై మాత్రం కాలేజీ అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అమ్మాయిలకు మాత్రం నీహారిక చీరలు కాస్త బోరింగ్ గా అనిపించాయట. ఒక మనసు మూవీ మొత్తంలో నీహారిక 60 కి పైగా చీరలు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్ లు, మ్యాచింగ్ నగలతో కనిపించింది. తను వేసుకున్న డ్రెస్ ల డిజైనింగ్ నాగబాబు భార్య పద్మజ చేసిందని అంటున్నారు. నాగబాబు కూతురు నిహారిక కు ఇది మొదటి సినిమా . అలాంటప్పుడు నీహారికను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలాంటి డ్రెస్ డిజైన్స్ ను సెలెక్ట్ చేశారేమిటి? అని కొందరంటున్నారు.

,  ,  ,  ,  ,  ,