Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 10:27:00
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ బలం పబ్లిసిటీనే. తన సినిమాల గురించి జనాల్లో క్యూరియాసిటీ పెంచడంలో ఆయన సూపర్ సక్సెస్ అవుతుంటాడు ఎప్పుడూ. ఇందుకోసమే ఆయన చాలా వరకు వివాదాస్పద అంశాల మీదే సినిమాలు తీస్తుంటారు. తాజాగా ఆయన ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో ?వంగవీటి? సినిమా తీశారు. ఈ సినిమా టైటిల్ చాలు.. కాంట్రవర్శీ క్రియేట్ చేయడానికి.. జనాల్లో క్యూరియాసిటీ పెంచడానికి. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. ఇక లేటెస్టుగా ట్రైలర్ రిలీజయ్యాక ఆ ఆసక్తి మరింత పెరిగింది. మళ్లీ ?రక్తచరిత్ర? నాటి ఫామ్ చూపించాడు ఈ ట్రైలర్లో వర్మ.

అనేక వివాదాస్పద అంశాలతో.. టాప్ క్లాస్ విజువల్స్ తో తీర్చిదిద్దిన ?వంగవీటి? ట్రైలర్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ?వంగవీటి? ట్రైలర్ రిలీజైన రెండు రోజుల్లోపే మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. సోమవారం సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ బుధవారం ఉదయానికే పది లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని వర్మ చూస్తున్నాడు కానీ.. సెన్సార్ విషయంలోనే ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి అసలే సెన్సిటివ్ ఏరియా అయిన విజయవాడల ఈ సినిమా కారణంగా గొడవలు చెలరేగుతాయేమో అన్న సందేహాలున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో ఎలా స్పందిస్తుందో.. ఈ సినిమా ఎప్పుడు.. ఈ స్థితిలో ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,