Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 13:18:09
facebook Twitter Googleplus
Photo

రాణా హీరోగా తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగులో మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తేజకు ఈ చిత్రం చెప్పుకోదగ్గ విజయాన్ని తెచ్చిపెట్టింది. బాహుబలి తర్వాత రాణాకు విపరీతమైన క్రేజ్ రావడంతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి తమిళంలో ఆశించినంత ఆదరణ లభించలేదు. అయితే తాజాగా రాణా తన అదృష్టాన్ని మలయాళంలో పరీక్షించుకోబోతున్నాడు.

తెలుగులో ఘనవిజయం సాధించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం తమిళ తంబీలకు పెద్దగా రుచించలేదు. ఘాజీ బాహుబలి తరహాలోనే ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుందని ఆశించిన రాణా భంగపడ్డాడు. అయితే తాజాగా ఈ సినిమాను కేరళలో శుక్రవారం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘రాజ కిరీడం’ పేరుతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయబోతున్నారు.

,  ,  ,  ,  ,  ,