Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 11:54:56
facebook Twitter Googleplus
Photo

ఇటీవల 'ముకుంద' సినిమా ద్వారా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. 'బెంగళూరు డేస్' రీమేక్ లో ఓ హీరోగా వరుణ్ ని అడిగినట్టూ, చేయడానికి అతను ఒప్పుకున్నట్టూ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి శర్వానంద్, వరుణ్ హీరోలుగా నటిస్తారనీ... అదే తమిళ వెర్షన్ కి ఆర్యా, రానా దగ్గుబాటి నటిస్తారనీ అంటున్నారు. నిత్యామీనన్ ప్రధాన కథానాయికగా ఇప్పటికే ఎంపికైంది.

,  ,  ,  ,  ,