Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2015 15:34:01
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న రెండో సినిమా కంచె ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇటీవలే టీజర్ పోస్టర్లు రిలీజ్ చేశారు. వీటికి అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్ స్టార్ పవన్ నుంచి వరుణ్ కి ప్రశంస దక్కింది. అదే హుషారులో త్వరలో (అక్టోబర్) రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా గురించి వరుణ్ తేజ్ చాలా సంగతులే చెప్పాడు.

= ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఇండియా జార్జియా లాంటి చోట్ల తెరకెక్కించారు. 1 సెప్టెంబర్ 1939 లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలైంది. అందుకే అప్పటి కాలమాన పరిస్థితుల్ని తెరపై ఆవిష్కరించడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది.

=నేను ఒక సైనికుడిగా నటించాను. అప్పటి సైనికుడు కాబట్టి అందుకు తగ్గట్టే వేషం భాష ఆహార్యం ఉండాలి. దానికోసం ఎక్స్ ఆర్మీ అధికారిని పరిశీలించాను. ఆ బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ సెన్స్ వంటివి ప్రాక్టీస్ చేశాను.

=అంతేకాదు ఈ సినిమా చాలా భాగం షూటింగ్ జార్జియాలో జరిగింది. అక్కడ నాతో పాటు షూటింగులో పాల్గొన్నది అవసరాల ఒక్కడే. మిగతా వాళ్లంతా తెల్లోళ్లే.

= ఈ చిత్రంలో 1935లో ఉపయోగించిన ఓ గన్ని నేను ఉపయోగించాను. దీంతోనే థాంప్సన్ అనే వాడిని రెండో ప్రపంచ యుద్ధంలో వారియర్స్ కాల్చి చంపారు. ఈ గన్ ని టామీ గన్ అని కూడా పిలుస్తారు.

=జర్మనీని ఎదుర్కొనే ఇండియన్ సైనికుడిగా కనిస్తా. ఇటలీ బార్డర్ లో ఓ సైనిక బెటాలియన్ ఉండే చోట కీలకసన్నివేశాల్ని తెరకెక్కించారు. అక్కడే టెంట్ లు వేసి రియల్ సైనికుల్లా తిష్ట వేశాం.

=జార్జియాలో సూర్యుడు 9గంటలకు అస్తమిస్తాడు. వేకువఝాము 6గంటలకు షూటింగ్ మొదలు పెడితే 9తర్వాతే ముగించే వాళ్లం. అంతగా శ్రమించాం.

,  ,  ,  ,