Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 13:46:12
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ హీరోల్లో వరుణ్ తేజ్ కు డిఫరెంట్ ఇమేజ్ ఉంది. తొలి సినిమాగా ముకుంద చేయడం.. ఆ తర్వాత క్రిష్ మూవీ కంచెతో మంచి పేరు సంపాదించుకున్నా.. లోఫర్ తో ఫ్లాప్ ఎదుర్కున్నాడు వరుణ్ తేజ్. అలాగే ఆగడు-బ్రూస్ లీ అంటూ రెండు వరుస ఫ్లాప్స్ తో ఎదురు దెబ్బలు తిన్న శ్రీను వైట్ల.. ఓ మెట్టు దిగొచ్చి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాల్సి వచ్చింది.

వరుణ్ తేజ్- శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన మిస్టర్.. 80శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని రీసెంట్ గా నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రీ రిలలీజ్ బిజినెస్ పనులు ప్రారంభమైపోయినట్లు భోగట్టా. ఒక్కో సినిమాకు కనీసం 10 కోట్లు పారితోషికం అందుకున్న శ్రీను వైట్ల.. ఈసారి పార్ట్నర్ గానే సినిమా చేస్తున్నాడు. అంటే మూవీ సక్సెస్ ను బేస్ చేసుకుని వైట్లకు లాభాల్లో వాటాలు వస్తాయన్న మాట. కానీ శ్రీను వైట్లకు తన స్థాయిలో పారితోషికం మిస్టర్ ద్వారా ముట్టాలంటే.. కనీసం ఆ చిత్రం 30 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

వైట్ల బ్రాండ్ తో ఆంధ్రలో 10 కోట్లకు రైట్స్ విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే నైజాం-సీడెడ్ ల ద్వారా మరో 15 కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్.. ఆడియో.. ఇతరాలు అన్నీ కలుపుకుని మొత్తం 30 కోట్లు రాబడితేనే.. ఈ మూవీ ద్వారా వైట్లకు తన రేంజ్ లో రెమ్యూనరేషన్ వస్తుందని అంటున్నారు.

12 కోట్ల రూపాయల టైట్ బడ్జెట్ లో మొత్తం సినిమాను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఫ్రెష్ గా ఉండడం.. వైట్ల నుంచి చాలా ఏళ్ల తర్వాత ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ వస్తోందనడంతో.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ వరుణ్ తేజ్ మూవీ 30 కోట్ల బిజినెస్ చేయగలదా అన్నదే అసలు డౌట్. మీడియం రేంజ్ హీరోలు బ్లాక్ బస్టర్ సాధిస్తే మాత్రమే ఈ మార్క్ అందుకోవడం సాధ్యం.

,  ,  ,  ,  ,  ,