Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2016 16:40:04
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగ చైతన్య - మలయాళీ భామ మంజిమా మోహన్ జంటగా నటించిన సాహసం స్వాసగా సాగిపో చిత్రానికి సంబంధించి ఓ పాట రిలీజ్ అయింది. అసలు రెండు నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా అయిపోయినా.. కొన్ని కారణాలతో రిలీజ్ లేట్ అయింది. చైతూ తన తర్వాతి ప్రాజెక్ట్ మజ్నూను కూడా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. అయితే గౌతం మీనన్ డైరెక్షన్లో నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని.. కంప్లీట్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది.

గౌతం మీనన్ - కోన వెంకట్ లు ఈ మూవీని నిర్మిస్తుండగా.. రెండు సార్లు ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈయన కంపోజ్ చేసిన ఓ పాటను.. గౌతమ్ మీనన్ విడుదల చేశాడు. కాలం నేడిలా మారెనే పరుగులు తీసెనే అంటూ సాగే ఆ పాట.. సంగీత పరంగా ఆకట్టుకుంటుంది. వెళ్లిపోమాకే అంటూ ఈ పాట సాగుతున్న విధానం మాత్రం.. రెహ్మాన్ తనే మ్యూజిక్ ఇచ్చిన మరో పాటను గుర్తు చేస్తోంది.

'ఐ' సినిమాలోని 'నువ్వుంటే నా జతగా' పాట కూడా సాహసం శ్వాసగా సినిమాలో మాదిరిగానే ఉంటోంది. ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇలా ఒకే రకమైన ట్యూన్ వినిపించడంతో మ్యూజిక్ లవర్స్ బాగా ఫీలయ్యారు. హై బీమ్ తో వినిపించే సౌండ్ తప్ప.. మిగిలిన సాంగ్ పాడే విధానం వినిపించే ట్రాక్ ఒకటేగా ఉండడంతో.. ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు.


,  ,  ,  ,