Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 13:13:21
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్ హిట్‌తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ?బాబు బంగారం? పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ వినోద ప్రధానమైన పోలీస్ అధికారి పాత్ర పోషిస్తుండగా ఉగాది కి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ?బాబు బంగారం? త్వరలో పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళుతున్నట్లు తెలిసింది. త్వరగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాని జులై 1 విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయన తార నటిస్తున్నది. ?భలే భలే మగాడివోయ్? ఘనవిజయం తరువాత మారుతి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,