Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2017 12:42:25
facebook Twitter Googleplus
Photo

హీరో వెంకటేష్ గోపాల గోపాల సినిమాను చేస్తున్నప్పుడు.. ఆ సినిమాలో కృష్ణుడి పాత్రను ఎవరితో చేయించాలి అని అనుకున్నప్పుడు.. వెంటనే వెంకటేష్ కు తనకు ఎంతగానో ప్రీతిపాత్రమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడట. వెంటనే రోల్ గురించి చెప్పగా.. పవన్ కూడా ఫ్లూట్ వాయించేశాడు. ఇప్పుడు కట్ చేస్తే.. ఆ రోల్ చేసినందుకు ప్రతీకగా తను కూడా తన వంతు చేస్తున్నాడు వెంకీ.

త్రివిక్రమ్ డైరక్షన్లో ప్రస్తుతం ఒక ఇరానీ కేఫ్ బ్యాక్ డ్రాప్ లో.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా కనిపిస్తాడని టాక్. అందుకోసం మనోడు బాగా స్లిమ్ అయ్యాడు కూడా. అయితే ఈ సినిమాలో ఒక చిన్నపాటి కామెడీ చేసే పాత్ర ఒకటి ఉందట. దాని నిడివి కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ పాత్రను సునీల్ చేస్తే బాగుంటుందని రాసుకున్నాడు త్రివిక్రమ్. కాని కట్ చేస్తే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పాత్ర కోసం వెంకీని తీసుకుని.. దానికి హీరోయిజం దట్టిస్తే బాగుంటుందని సెలవిచ్చాడట. దానితో ఈ పాత్రను కాస్త మార్చి వెంకీకి చెప్పగా.. డేట్స్ ఎప్పుడో చెప్పండి వచ్చి నటించి వెళిపోతా అన్నాడట. మొత్తానికి పవన్ సినిమాలో వెంకీ క్యామియో అంటే.. మరోసారి ఇదేదో చిన్నపాటి మల్టీస్టారర్ అనే ఫీలింగ్ వచ్చేస్తోంది.

ఆ మధ్యన కాటమరాయుడు సినిమా కోసం.. తమ్ముళ్ల పాత్రలను అంతగా క్రేజ్ లేని నటులకు ఇచ్చేసి.. తద్వారా వెండితెరపై సినిమాకు పెద్దగా ఫీల్ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్.

,  ,  ,  ,  ,  ,  ,