Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Mar-2016 12:16:42
facebook Twitter Googleplus
Photo

వేదాళంతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్.. తన నెక్ట్స్ మూవీకి సిద్ధమవుతున్నాడు. దీపావళికి రిలీజ్ అయిన వేదాళం హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అజిత్. ఇప్పుడు మరోసారి వేదాళం దర్శకుడు శివకే ఛాన్స్ ఇస్తున్నాడు అజిత్. గతంలో వీరం - వేదాళం చిత్రాలను ఈ దర్శకుడే తీశాడు.

అజిత్ నుంచి ఓకే అనిపించేసుకున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ ని ఫైనల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అజిత్ తో కలిసి గౌతమ్ మీనన్ మూవీ ఎన్నై అరిందాల్ లో నటించిన అనుభవం అనుష్కకు ఉంది. అందుకే ఆమెనే మరోసారి తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈమెనే కాకుండా. తమన్నా - నయనతార - క్రితి సనోన్ లను కూడా పరిశీలించారు. అయితే చివరకు అజిత్ అనుష్కకే మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది.

ప్రీప్రొడక్షన్ పనుల్లో భాగంగా.. దర్శకుడు ఇప్పటికే కొడైకేనాల్ లో క్యాంప్ వేశారు. వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా అక్కడే ఉన్నాడు. కొన్ని ట్రాక్స్ ను అనిరుధ్ అందించనున్నాడని చెబుతున్నారు. వేదాలం కు మించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వాలన్నది అనిరుధ్ ఆలోచన. మే నెలలో జరిగే ఎన్నికలకు ముందే పాటలకు ట్యూన్స్ ఇచ్చేస్తానంటున్నాడు అనిరుధ్. జూన్ లో రెగ్యులర్ షూటింగ్స్ కు వెళ్ల నున్న తల 57... 2017 పొంగల్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,