Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 13:41:48
facebook Twitter Googleplus
Photo

గత నెలలోనే బాబు బంగారంతో పలకరించాడు విక్టరీ వెంకటేష్. దీనికి ముందు ఏడాదిన్నర పాటు విరామం తీసుకున్న వెంకీ.. ఇకపై స్పీడు పెంచాలనుకుంటున్నాడు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులకు కమిటైన వెంకీ.. వేగంగా ఒకదాని తర్వాత ఇంకో సినిమాను ముగించేయాలనుకుంటున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో వెంకీ కీలక పాత్ర చేస్తున్న ?సాలా ఖడూస్? రీమేక్ ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయిన సంగతి చాలామందికి తెలియదు. ప్రారంభోత్సవ హడావుడి ఏమీ చేయకుండా షూటింగుకి వెళ్లిపోయింది ఈ చిత్ర బృందం. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ పాత్ర కోసం వెంకీ లుక్ మార్చుకున్నాడు. అందుకోసం రెండు నెలలకు పైగా కష్టపడ్డాడు.

విశేషం ఏంటంటే.. వెంకీ లుక్ అప్పుడే బయటకు వచ్చేస్తోంది. ఈ రోజు సాయంత్రమే వెంకీ అన్న కొడుకు దగ్గుబాటి రానా వెంకీ ఫస్ట్ లుక్ ను పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రానానే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. తన బాబాయ్ ఫస్ట్ లుక్ పరిచయం చేయబోతున్నందుకు చాలా ఎగ్జైటింగా ఉందని రానా చెప్పాడు. క్రీడల్లో రాజకీయాల వల్ల కెరీర్ కోల్పోయిన ఓ బాక్సర్.. తర్వాత కోచ్ గా మారి ఓ స్లమ్ ఏరియాకు చెందిన అమ్మాయిని అంతర్జాతీయ బాక్సర్ గా తీర్చిదిద్దే నేపథ్యంలో ?సాలా ఖడూస్? సాగుతుంది. హిందీతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. దర్శకురాలు సుధ కొంగర తెలుగమ్మాయే కావడం విశేషం. ఇందులో కీలక పాత్రను ఒరిజినల్లో నటించిన రితికా సింగే చేస్తోంది. దగ్గుబాటి సురేష్ సమర్పణలో వైనాట్ స్టూడియోస్ నిర్మించే ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,