Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 15:33:01
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్ నిర్మాతల హీరో. నిర్మాత కష్టాలు వెంకటేష్ కి బాగా తెలుసు. ఎందుకంటే ముందు ఆయన నిర్మాత రామానాయడుగారబ్బాయి. ఆ తర్వాతే ఏదైనా. వెంకీ తో సినిమా చేసే ఏ నిర్మాతైనా చాలా కంఫర్టబుల్ గా వుంటారు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా నిర్మాత కు అండగా నిలబడే హీరోల్లో వెంకీ ఒకరు. ఇప్పుడు బాబు బంగారం విషయంలో కూడా నిర్మాత చినబాబుకు ఫుల్ సపోర్ట్ గా నిలిస్తున్నారు.

వెంకీ తాజా చిత్రం ?బాబు బంగారం? ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ కి సిద్ధమైయింది చిత్ర యూనిట్. ఏ సినిమా ప్రమోషన్స్ లోనైనా హీరోయిన్ కనిపిస్తే కొంచెం గ్లామరస్ గా వుటుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా సినిమా సైన్ చేసినప్పుడే ప్రమోషన్స్ కూడా కమిట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా హీరోయిన్ నయనతార రూటే సపరేటు. ఆమె ఎలాంటి ప్రమోషన్స్ కు రాదు. అమెదంత అదో టైపు వ్యవహారం.

నయనతార వ్యవహారంతో కాస్త ఆలోచనలో పడ్డ నిర్మాత చినబాబుకు ఇప్పుడు హీరో వెంకటేష్ కొండంత అండ ఇచ్చాడు. హీరోయిన్ విషయాన్ని లైట్ తీస్కో మని చెప్పిన వెంకీ.. చిత్ర ప్రమోషన్స్ ను సోలోగా భుజాన ఎత్తుకున్నారు. ఇప్పటికే కొన్ని ఇంటర్ వ్యూ లను రికార్డ్ చేయించాడు. అలాగే విడుదలకు ముందు అన్నీ చానల్స్ కు ఇంటర్వ్యూలిఇస్తానని చెప్పారట. ప్రమోషన్స్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదన్న వెంకీ హామీ తో ఇప్పుడు రిలాక్స్ అయ్యారు చిత్ర నిర్మాత. ఈ ఎపిసోడ్ తో మరోసారి నిర్మాతల హీరో అనిపించుకున్నారు వెంకీ.

,  ,  ,  ,  ,  ,