Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 11:44:49
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 తర్వాత దగ్గుబాటి రానా నుంచి రానున్న లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది కూడా. ఈ మూవీలో రానాకి జోడీగా కాజల్ నటిస్తుండగా.. మరో భామ కేథిరన్ థ్రెసా కూడా సత్తా చాటనుందనే విషయం అర్ధమవుతోంది.

సరైనోడు చిత్రం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ను పలరించనుంది ఈ మలయాళీ బ్యూటీ. ఈ చిత్రంలో ఈమె ఓ మీడియా సంస్థకు అధినేతగా పని చేస్తుందనే టాక్ ఉంది. అయితే.. కేథరిన్ పాత్ర ఓ నెగిటివ్ రోల్ అనే టాక్ ఉంది. టాలీవుడ్ స్క్రీన్ కు తన నెగిటివ్ షేడ్స్ ను కేథరిన్ చూపించబోతోందని అంటున్నారు. తాజాగా నెట్ లో హల్ చల్ చేస్తున్న షూటింగ్ స్పాట్ పిక్ చూస్తే.. కేథిరిన్ థ్రెసా పాత్ర ఎలా ఉండనుందనే విషయం అర్ధమవుతుంది. పొలిటికల్ డ్రామాగా నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు తేజ. ఈయన కేథరిన్ కోసం ఓ మాంచి పాత్రను క్రియేట్ చేశాడనే సంగతి ఈ వర్కింగ్ స్టిల్ చూస్తే అర్ధమవుతోంది. మీడియా భామగా అందరినీ గడగడలాడించే కేరక్టర్ బాగానే మెప్పిస్తున్నట్లుగా ఉంది ఈ బ్యూటీ.

ఖైదీ నంబర్ 150లో ఐటెం సాంగ్ చేసే అవకాశం పోగొట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం బోయపాటి- బెల్లంకొండ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో అదే టైపు సాంగ్ చేస్తోంది.

,  ,  ,  ,  ,