Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 11:53:30
facebook Twitter Googleplus
Photo

పూరీ ఈ మధ్య ఫామ్ లో లేడన్న విషయం స్పష్టంగా తెలిసిందే. జ్యోతిలక్ష్మి - లోఫర్ చిత్రాల తర్వాత.. చేతిలో ఉన్న రోగ్ సినిమాను కంప్లీట్ చేస్తున్నాడంతే. ఆ తర్వాత లోఫర్ డిస్ట్రిబ్యూటర్ల వివాదం పూరీ ఇమేజ్ ను బాగానే దెబ్బ కొట్టింది. దీంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు అనౌన్స్ చేసేస్తూ తన రేంజ్ తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పూరీ.

నందమూరి కళ్యాణ్ రామ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో పూరీ ఇప్పటికే సినిమాలు చేసేందుకు ఓకే అనిపించుకున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ పూర్తయ్యాక కళ్యాణ్ రామ్ సినిమాను ప్రారంభిస్తాడు కూడా. అయితే.. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. యంగ్ టైగర్ తో చేయబోయే సినిమా డీటైల్స్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేశాడట పూరీ. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో పాటు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూరీ ఇచ్చే గిఫ్ట్ ఇదన్న మాట.

విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయడానికి పూరీ ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. ఇక మహేష్ తో మూవీపైనా గత నెలలో ప్రకటించాడు పూరీ. జన గణ మన టైటిల్ పై మహేష్ తో సినిమా చేయనున్నాడు. అయితే.. ఇవేవీ ఈ ఏడాది ప్రారంభం అయ్యేవి కాకపోవడం ఆలోచించాల్సిన విషయం

,  ,  ,  ,  ,