Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 10:47:12
facebook Twitter Googleplus
Photo

అక్కినేని వారి పెళ్లి వేడుక రానే వచ్చింది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో ఇద్దరు సెలబ్రెటీలు గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. మొన్నటి వరకు వీరి పెళ్లి ఎంత అట్టహాసంగా జరగబోతుందా అని అనేక వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు పెళ్లి స్టార్ట్ అయ్యి ముగిసేవరకు కూడా ఈ వేడుక న్యూస్ ఏక్కువగా హల్ చల్ చేసేలా ఉంది. దాదాపు 10 కోట్లవరకు ఈ పెళ్లి వేడుకకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అక్కినేని- దగ్గుపాటి కుటుంబాలు ప్రత్యేక విమానంలో గోవాకు చేరుకున్నారు. డబ్ల్యు రిసార్ట్ వారికి ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సమంత కు పెళ్లి రోజున రామానాయుడు సతీమణి నాగచైతన్య అమ్మమ్మ తరపున పెళ్లి చీర ఇవ్వనున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా సమంత - చైతు వెడ్డింగ్ కార్డ్ ఒకటి బయటపడింది. పక్కా ప్లానింగ్ తో శుక్రవారం ప్రతి సంబరానికి షెడ్యూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రేపు పూర్తిగా అక్కినేని వారి తరఫు నుండి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయత్రం ఆరుగంటల వరకు మెహంది ఫంక్షన్ జరగనుంది. ఇక ఆ వెంటనే 8.30 గంటలకు భోజనాల కార్యక్రమం. ఇక సరిగ్గా రాత్రికి 11 గంటల 52నిమిషాలకి హిందూ సంప్రదాయం ప్రకారం నాగ చైతన్య - సమంత మేడలో మూడు ముళ్లు వేస్తాడు.

ఇక సమంత కుటుంబ సభ్యుల సాంప్రదాయం ప్రకారం శనివారం పూర్తిగా క్రిస్టియన్ పద్ధతుల్లో మ్యారేజ్ జరగనుంది. ఈ వేడుకలో కూడా ముందుగా 12 గంటల నుంచి 3 గంటల వరకు బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ - లంచ్ కి మధ్యలో ఉండే ఓ తరహా విందు) కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు క్రిస్టియన్ ఆచార పద్ధతుల్లో చైతు -సమంత ల వెడ్డింగ్ జరగనుంది.

,  ,  ,  ,  ,  ,