Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 11:33:30
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లో రాణించాలంటేనో ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమిటి? అన్ని పాత్రల్లో నటించగలగడం.. కళ్లతో భావాలు పలికించడం.. యాక్షన్ లో మంచి ఈజ్ ఉండటం... ఎక్సెట్రా ఎక్సెట్ర్రా... ఇలా చాలా మంది చాలా క్వాలిటీల గురించి చెబుతారు. కానీ బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్ మాత్రం కొత్త డెఫినిషన్ ఇచ్చింది. యాక్టర్ గా క్లిక్ అవడానికి కావాల్సింది సిగ్గులేకుండా ఉండటం అని.

‘‘సిగ్గులేకుండా ఉండటం (షేమ్ లెస్) ఒక యాక్టర్ కు చాలా ఇంపార్టెంట్. మొహమాటం... భయపడటం ఇక్కడ పనికిరావు. బిందాస్ గా ఉండటం అలవాటవ్వాలి’’ అంటోంది విద్యాబాలన్. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ పాత్రలతో.. మంచి యాక్టింగ్ తో అందరినీ మెప్పించుకుంటూ నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన నటి ఒక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించినా సిగ్గు.. బిడియం.. మొహమాటం వంటివి ఇండస్ట్రీకి ఎంత మాత్రం పనికిరావని కాస్తంత గట్టిగా చెప్పేసింది. సినిమా రంగమే కాదు.. ఎక్కడయినా ఆత్మవిశ్వాసమే కోరిన విజయాలను అందిస్తుంది. అందుకే విజయం కోసం ఎవరి దారి వాళ్లు వెతుక్కోవాల్సిందే అన్నది విద్యా బాలన్ మాట.

విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ తుమ్హారీ సులు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విద్యది మధ్యతరగతి ఇల్లాలి పాత్ర. అనుకోకుండా రేడియో జాకీగా మారి గుర్తింపు తెచ్చుకుంటుంది.

,  ,  ,