Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 10:49:32
facebook Twitter Googleplus
Photo

పరిశ్రమలో సక్సెస్ కు ఉన్న విలువ మరే అంశానికీ ఉండదు అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఒక్క సక్సెస్ సాధించి.. ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్లు ఎంతో మంది ఉంటారు. అలాంటిది సెన్సేషనల్ సక్సెస్ సాధించడంతో పాటు.. అపరిమితమైన గుర్తింపు కూడా సంపాదించేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో.. ఇప్పుడు అర్జున్ రెడ్డితో భారీ సక్సెస్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ ఒక్క సక్సెస్ తో ఈ హీరో రేంజ్ ఎలా మారిపోయిందో తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలకు.. ఈ హీరో ఉండడమే పెద్ద అట్రాక్షన్ అయిపోతుంది. సడెన్ గా వచ్చిన స్టార్ డంను కుర్రాడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు.. ఇతర సినిమాలకు కూడా ప్రచారం చేసి పెట్టేసే రేంజ్ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఏకంగా ఓ బాలీవుడ్ మూవీకి ఇక్కడ తగిన ప్రచారం లభించేందుకు.. విజయ్ దేవరకొండనే ఎంజుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా.. భూమి పెడ్నేకర్ జంటగా నటించిన శుభ్ మంగళ్ సావధాన్ చిత్రం ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతులమీదుగా లాంఛ్ చేయించడం విశేషం. అఫ్ కోర్స్.. ఈ సినిమా రిలీజ్ ఇవాళే.

అయితే.. కొన్ని రోజుల ముందే ఈ ట్రైలర్ లాంఛ్ ను విజయ్ చేతుల మీదుగా చేయించగా.. రీసెంట్ గానే ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించిన విజయ్ దేవరకొండ.. ఆ రిలీజ్ ను పురస్కరించుకునే ఈ ఫోటోను పోస్ట్ చేశాడు.

,  ,  ,  ,  ,