Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 13:26:24
facebook Twitter Googleplus
Photo

భారత దేశ సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయాన నటీమణులు అతికొద్దిమంది ఉంటారు. హింది లో మధుబాల మీనాకుమారి తెలుగులో మహానటి సావిత్రి అనే చెప్పాలి. తెలుగుకు మాత్రమే పరిమతం కాలేదు ఈ మహానటి తమిళనాడు లోకూడా అంతే గౌరవం ఆదరణ పొంది శాశ్వతంగా సినిమా చరిత్రలో నిలిచిపోయింది. అటువంటి మహానటి జీవిత చరిత్ర ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు.

ఇప్పటికే ఎవ్వరూ అనుకోని ఒక కాంబినేషన్ తో కాస్టింగ్ చేశారు. నేను శైలజ నేను లోకల్ హీరోయిన్ కీర్తి సురేశ్ సావిత్రిగా.. తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఒక జర్నలిస్టుగా.. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ఏంటి అంటే పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నారు అని తెలుస్తుంది. సినిమాలో సమంత జర్నలిస్టు అయితే.. ఆమె భర్తగా ఇప్పుడు విజయ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాకి మహానటి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బయో పిక్ ని నాగ్ అశ్విన్ తీస్తున్నసంగతి తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలవుతుంది. సినిమా కాస్టింగ్ అంతా యంగ్ స్టార్స్ ని తీసుకుంటున్నారు. ఇది కూడా తమిళ్ తెలుగు లో విడుదల చేస్తారు

,  ,  ,  ,