Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2015 11:15:34
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ సినిమా అంటేనే అది ఒక రేంజ్ లో వుండాలి .. లేదంటే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. వాళ్లు ఫుల్ ఖుషి కావాలంటే తెరపై భారీతనం కనుల నిండుగా కనిపించవలసిందే. అలా కనిపించాలంటే ఆ రేంజ్ లో ఖర్చు పెట్టవలసిందే. అందుకే తాజాగా ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా బడ్జెట్ ని తట్టుకోవడానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ రంగంలోకి దిగాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో 'లండన్'లో ఆరంభం కానుంది.

ఈ సమయంలో ఈ సినిమా మరింత భారీతనాన్ని సంతరించుకోవడం ఎన్టీఆర్ అభిమానులకి సంతోషాన్ని కలిగించే విషయం. తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు భాగస్తులయ్యారు. ఇప్పుడిక ఈ సినిమా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో .. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతుందన్నమాట. ఎన్టీఆర్ జోడీగా రకుల్ కనువిందు చేయనున్న ఈ సినిమా షూటింగుకి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,