Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Dec-2017 11:54:33
facebook Twitter Googleplus
Photo

అఖిల్ ప్రాజెక్టుల గురించి వారిని అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో తెలియదు గాని వారి తండ్రి నాగార్జునను అడిగితే మాత్రం తప్పకుండా కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. తన సినిమాలను చేసుకుంటూ.. కుమారుల సినిమాల గురించి కూడా ఆలోచిస్తూ నాగ్ ఈ వయసులో కూడా చాలా ఈక్వల్ గా ఫ్యామిలీ ని సెట్ చేసుకుంటూ వస్తున్నాడు.

ఇకపోతే హలో సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ ని నాగార్జున హై రేంజ్ లో చేస్తున్నారు. రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగ్ కుమారుల నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి వివరణ ఇచ్చాడు. మరొకసారి విక్రమ్ కె కుమార్ మళ్లీ తమ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లు చెప్పాడు. నాగ చైతన్య తో ఒక డిఫెరెంట్ సినిమాను చేస్తాడని ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

అక్కినేని మూడు తరాలకు ఒక కానుకగా విక్రమ్ కె కుమార్ మనం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దర్శకుడు ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయాడు. దీంతో అఖిల్ తో హలో సినిమాను చేశాడు. ఇక నెక్స్ట్ ఇయర్ నాగ చైతన్య తో ఒక సినిమాను చేస్తాడట. అయితే ఆ లోపు విక్రమ్ వేరే ప్రొడక్షన్ లో ఒక స్టార్ హీరోతో సినిమాను ఫినిష్ చేసుకుని వస్తాడట. అలాగే చైతు కూడా శైలజా రెడ్డి అల్లుడు - సవ్యసాచి సినిమాలను ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాత విక్రమ్ తో కలుస్తాడు అని నాగార్జున వివరించారు.

,  ,  ,  ,  ,