Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 11:31:42
facebook Twitter Googleplus
Photo

విభిన్నమైన యాక్టింగ్ కు.. యాక్టింగ్ ట్యాలెంట్ కు చియాన్ విక్రమ్ కేరాఫ్ అడ్రస్. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొని రీసెంట్ గా ఇరు మగన్(తెలుగులో ఇంకొక్కడు)తో భారీ సక్సెస్ నే సాధించాడు. సాధారణంగా ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తూ.. ప్రతీ కేరక్టర్ లోనూ విభిన్నంగా కనిపించేందుకు తపన పడే విక్రమ్.. ఈ సారి ఆడియన్స్ కు షాక్ ఇవ్వబోతున్నాడు. ఒకేసారి ఐదు సినిమాలకు సైన్ చేసేసి.. అందులో మూడింటిని మొదలుపెట్టేయనున్నాడట.

హరి దర్శకత్వంలో సామి సీక్వెల్ కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విక్రమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు మరికొంత సమయం ఉంది. దీంతో మరిన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. హాలీవుడ్ మూవీ డోంత్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు సై అన్న చియాన్.. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బ్రామ్మన్ ఫేం సోక్రటీస్.. సేతుపతి చిత్రాన్ని తీసిన అరుణ్ కుమార్ లు చెప్పిన స్క్రిప్ట్ లకు కూడా పలు మార్పులతో ఓకే చేశాడట విక్రమ్.

ఇవన్నీ కాకుండా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ సినిమా కూడా చేయనున్నాడు విక్రమ్. ఇలా ఒకేసారి ఐదు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విక్రమ్ కెరీర్ లో ఇదే తొలిసారి కాగా.. ఈ ఐదింటిలో మూడు సినిమాలు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అయిపోతాయట కూడా.

,  ,  ,  ,  ,  ,