Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 12:15:03
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని.. వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. వీటిలో రీసెంట్ గా వచ్చిన జెంటిల్మన్ మినహాయిస్తే.. దాదాపు అన్నీ లవ్ స్టోరీలే. సక్సెస్ లు సాధించిన భలే భలే మగాడివోయ్.. కృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రాలు కూడా లవ్ స్టోరీలే. అయితే.. వాటిలో ఇంకో ఎలిమెంట్ కూడా మిక్స్ అయిఉంటుంది భలేభలే లో మతిమరుపు.. కృష్ణగాడిలో పిరికితనం.. నాని కేరక్టర్లో మిళితమై ఉంటాయి. అలా కాకుండా ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటుండగా.. విరించి వర్మ చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయిపోయా అంటున్నాడు నాని.

'మజ్ను నా సినిమా అని చెప్పుకోడానికి ప్రౌడ్ గా ఫీలవుతున్నాయి. మూవీ చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఫస్టాఫ్ లోనే నాలుగు పాటలు ఉన్నా.. అన్నీ స్టోరీలో పార్ట్ గానే వస్తాయి. లవ్.. హ్యూమర్.. ఎమోషన్స్ ని సమపాళ్లలో కలిపి మంచి స్టోరీ అందించేందుకు ప్రయత్నించాం. నా ప్రతీ సినిమాకి అన్ని వర్గాల ఆడియన్స్ ఉంటారు. అలాగే ఈ మూవీ లవ్ స్టోరీ అయినా.. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయచ్చు' అంటున్నాడు నాని.

దర్శకుడు విరించి వర్మ.. ఉయ్యాల జంపాల స్టోరీని మొదట తనకే చెప్పాడన్న నాని.. ఆ స్టోరీని కొత్త నటులతో చేస్తే బాగుంటుందని సూచించాడట. తనతో పని చేయాలనే కోరిక మజ్నుతో తీరిందని చెబుతున్నాడు నేచురల్ స్టార్ నాని.

,  ,  ,  ,  ,  ,  ,