Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2016 17:29:50
facebook Twitter Googleplus
Photo

యాక్షన్ హీరోలకు షూటింగుల్లో గాయాలవడం మామూలే. ఐతే కొందరు హీరోలు మరీ రిస్కీగా ఉండే ఫైట్లు.. ఫీట్లు చేసేస్తుంటారు. తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కూడా అంతే. తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసే విశాల్.. గతంలో రెండు మూడు సార్లు షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు.

తాజాగా మరోసారి విశాల్ కు పెద్ద గాయం అయింది. తన కొత్త సినిమా ?కత్తి సండై? షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఓ ఫైటర్ అతడి మీద అటాక్ చేసే సీన్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. విశాల్ భుజానికి రక్త గాయం కావడంతో వెంటనే షూటింగ్ ఆపేసి అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం వైద్యులు కొన్ని రోజుల పాటు విశాల్ ను విశ్రాంతి తీసుకోమన్నారట.

సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ?కత్తి సండై? ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసిన విశాల్.. ఈ మధ్య వరుసగా మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో నల్లనయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండం విశేషం. విశాల్ లేటెస్ట్ మూవీ ?మరుదు? హిట్ టాక్ తో నడుస్తోంది. ఈ చిత్రం తెలుగులో ?రాయుడు? పేరుతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది

,  ,  ,  ,  ,  ,  ,