Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 10:58:27
facebook Twitter Googleplus
Photo

ఐదు సినిమాలు రిలీజయ్యాక గత వారాంతంలో. ఐదు సినిమాలంటే అందులో ఒక్కటైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని భావిస్తే.. ఐదూ కూడా అడ్రస్ లేకుండా పోయాయి. వీటికి ఎలాంటి టాక్ వచ్చింది.. ఏమేరకు వసూళ్లు వచ్చాయన్నది పక్కన పెడితే.. కనీసం ఈ ఐదు ముందు ప్రేక్షకుల్ని థియేటర్లకే రప్పించలేకపోయాయి. ఉన్నంతలో ఉంగరాల రాంబాబు పరిస్థితి మేలు. సునీల్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ దీనికి తొలి రోజు ఉదయం ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ చిత్రానికి దారుణమైన టాక్ రావడంతో సాయంత్రానికే పరిస్థితి మారిపోయింది. కలెక్షన్లు పడిపోయాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత పేలవమైన సినిమాల్లో ఇది ఒకటనిపించుకుంది.

ఇక ఏమాత్రం హైప్ లేకుండా రిలీజైన కథలో రాజకుమారి పరిస్థితి దయనీయం. ఈ సినిమాపై ముందే ఆశలు పోయాయో ఏమో.. ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. టాక్ కూడా నెగెటివ్ గానే ఉండటంతో కలెక్షన్ల గురించి చెప్పాల్సిన పని లేకుండా పోయింది. ఇక ‘బాహుబలి’ రైటర్ ‘శ్రీవల్లీ’ గురించి మాట్లాడేవాళ్లే లేరు. దీనికి కూడా ఏమాత్రం హైప్ లేదు. సినిమా చూసిన వాళ్లు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకుల్ని టార్చర్ పెట్టే సినిమా అని సోషల్ మీడియాలో దీని గురించి కామెంట్లు వినిపించాయి. ఇక సచిన్ జోషి సినిమా వీడెవడు.. శింబు మూవీ సరసుడు గురించి అసలు డిస్కషనే లేదు. మొత్తంగా ఈ వీకెండ్లో బాక్సాఫీస్ మరీ డల్లయిపోయింది. ఎప్పుడో విడుదలైన ఫిదా.. అర్జున్ రెడ్డి సినిమాల పరిస్థితే కొత్త చిత్రాల కంటే మెరుగ్గా ఉందంటే అతిశయోక్తి కాదు.

,  ,  ,  ,  ,  ,