Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 13:24:23
facebook Twitter Googleplus
Photo

టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే.. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా విన్నర్ తొలి రోజు వసూళ్లలో బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఇది హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్. సుప్రీం తొలి రోజు కలెక్షన్లను విన్నర్ పెద్ద తేడాతో దాటేయడం విశేషం. తొలి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.63 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. సాయిధరమ్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. అతడి కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద హిట్టుగా ఉన్న సుప్రీమ్ తొలి రోజు మూడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టింది. విన్నర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ షేర్ రూ.7 కోట్లకు చేరువగా ఉంటుందని భావిస్తున్నారు.

సాయిధరమ్ లాస్ట్ మూవీ తిక్క డిజాస్టర్ అయినప్పటికీ ఆ ప్రభావం విన్నర్ మీద పడలేదు. మహాశివరాత్రి సెలవు రోజు కావడంతో తొలి రోజు వసూళ్ల మోత మోగింది. ఓవరాల్ గా టాక్ కొంచెం డివైడ్ గా ఉన్నప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బి-సి సెంటర్లలో సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. తొలి వారాంతంలో ఈ సినిమా రూ.14-15 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశాలున్నాయి.

ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో

,  ,  ,  ,  ,