Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 13:53:33
facebook Twitter Googleplus
Photo

తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ నుంచి ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూనే ఉన్నాడు. సక్సెస్ ల కంటే ఎక్కువగా హీరో హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసినా.. వైవీఎస్ కు ఎక్కువ గుర్తింపు తెచ్చిన సినిమాల్లో దేవదాసు ఒకటి. రామ్.. ఇలియానాలు ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు.

అయితే.. వైవీఎస్ గత చిత్రం రేయ్ కూడా ఈ కోవలోకి చెందినదే. సాయిధరంతేజ్.. సయామీ ఖేర్ లను ఇంట్రడ్యూస్ చేశాడు వైవీఎస్. కానీ ఆ సినిమా డిజప్పాయింట్ చేసింది. ఇది రిలీజ్ అయ్యేందుకు కూడా చాాలానే అగచాట్లు పడాల్సి వచ్చింది. రేయ్ విడుదల అయి రెండేళ్లు గడిచిపోయాయప్పుడే. ఈ రెండేళ్ల పాటు సినిమా మాటెత్తని వైవీఎస్.. ఇప్పుడు మళ్లీ కొత్త కథతో వస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ తనకు బాగా అచ్చొచ్చిన ప్రేమ కథ జోనర్ లోనే సినిమా చేయనున్నాడట ఈ దర్శకుడు. అలాగే తను చెప్పినట్లుగా వినేలా.. కొత్త ట్యాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఉద్దేశ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని వారాలుగా వైవీఎస్ చౌదరి తల్లి ఆరోగ్యంపై ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి వస్తోంది. ఫిజియోథెరపీ వంటి వాటిని దగ్గరుండి చూసుకుంటున్నాడట.

,  ,  ,  ,