Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2015 11:24:24
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి అనువదించి విడుదల చేసేటప్పుడు, ఆ సినిమాకి వేరే టైటిల్ పెడుతుంటారు. ఇక ఒరిజినల్ టైటిల్ తోనే ఆ సినిమా ఆడియన్స్ కి ఎక్కువగా తెలిసుంటే మాత్రం, ఆ సినిమాకి అదే టైటిల్ ఉంచేస్తుంటారు. తాజాగా 'జిల్లా' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. విజయ్ హీరోగా కాజల్ కథానాయికగా తమిళ్ లో రూపొందిన 'జిల్లా' సినిమా ఘనవిజయాన్ని సాధించింది. క్రితం ఏడాది తమిళ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. విజయ్ కెరియర్ లో కూడా చెప్పుకోదగిన హిట్ ఇది.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాను తెలుగులోకి అనువదించి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి కుమార్ రెడ్డి - ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా టైటిల్ ని మార్చాలని అనుకున్నప్పటికీ, ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటం వలన .. ఈ టైటిల్ తో ఇది జనంలోకి ఎక్కువగా వెళ్లడం వలన ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడిదే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

,  ,  ,  ,