Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 17:27:05
facebook Twitter Googleplus
Photo

అందాల సమంతను తెరపై చూసుకుని చాలా కాలమే అయ్యింది. క్యూట్ సమంత మనం - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈ అమ్మడు నటించిన సినిమాలేవీ రానేలేదు. అయితే తమిళ్ లో ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టులతో రెడీగా ఉంది. 10 ఎంద్రాతుకుళ్ల - 24 - విజయ్ 59 - వడ చెన్నయ్ ఇంకొన్నిటికి సంతకాలు చేసింది. ఇవన్నీ ఆన్ సెట్స్ ఉన్నాయి.

మరోవైపు తెలుగులో మహేష్ సరసన బ్రహ్మోత్సవం చిత్రంలో చేస్తోంది. అయితే వీటన్నిటిలో ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా 10 ఎంద్రాతుకుళ్ల. ఈ సినిమా తమిళ్ లో ఈనెల 21న రిలీజైపోతోంది. అయితే తెలుగువెర్షన్ మాత్రం రిలీజవ్వడం లేదని సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ కానీ రిలీజ్ తేదీ కానీ ఫిక్స్ చెయ్యలేదు. దీపావళి టైమ్ లో తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు.

అయితే టాలీవుడ్ లో దీపావళి రేసులో కంచె - బెంగాళ్ టైగర్ సినిమాలు రిలీజ్ లకు వస్తున్నాయి. నవంబర్ 12కి అటు ఇటూగా ఈ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. సమంత 10 ఎంద్రాతుకుళ్ల అప్పుడు రిలీజ్ చేస్తే వీటినుంచి పోటీ తప్పదు. అయితే 10 ఎంద్రాతుకుళ్ల టీజర్ లో విక్రమ్ స్టయిల్ - యాక్షన్ అదిరిపోయాయన్న టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ఛార్మి సంపూర్ణేష్ బాబు అతిధి పాత్రల్లో నటించారు. ఇవన్నీ పెద్ద అస్సెట్ అయ్యే ఛాన్సుంది. ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించారు.

,  ,  ,