Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 15:11:37
facebook Twitter Googleplus
Photo

నాగ చైతన్యతో టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లి హంగామా ఇప్పుడు ముగిసింది. ఈ విషయంపై స్వయంగా తనే ఓ స్పెషల్ పిక్ ను పోస్ట్ చేసి మరీ చెప్పింది సమంత. మొత్తానికి వెడ్డింగ్ సీజన్ ముగిసిందని.. దాదాపు 100 ఈవెంట్స్ ముగిసేందుకు కేవలం 40 రోజుల సమయం పట్టిందని చెప్పింది సమంత. ఫిష్ కట్ గౌనులో తెగ మెరిసిపోతున్న ఫోటోను.. సమంత షేర్ చేసింది.

అక్టోబర్ 6న చెయ్-సామ్ ల పెళ్లి.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగింది. ఆ రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగగా.. ఆ తర్వాతి రోజున క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం.. వీరిద్దరూ మరోసారి వివాహం ఆడారు. ఈ వేడుకకు అక్కనేని.. దగ్గుబాటి.. సమంతల కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది ఆహ్వానితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత లండన్ కు హనీమూన్ ఎగిరిపోయిన ఈ జంట.. అక్కడి నుంచి మాత్రం అప్ డేట్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు ఈ జంట. సమంత సొంత ఊరు చెన్నై అయినా.. సామ్ అత్తగారు ఉండేది కూడా అక్కడే. అందుకే చెన్నై రిసెప్షన్ ను చైతు మదర్ సెలబ్రేట్ చేశారు. మదర్ ఇన్ లా ఇంటి నుంచి బోలెడన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది సమంత.

ఆ తర్వాత హైద్రాబాద్ లో తన స్నేహితులకు.. ఇండస్ట్రీలో పలువురికి సూపర్బ్ పార్టీ అరేంజ్ చేశారు చైతు-సమంత. రీసెంట్ గా హైద్రాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు సమంత మామగారు అక్కినేని నాగార్జున

,  ,  ,  ,  ,  ,