Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2016 13:03:01
facebook Twitter Googleplus
Photo

కొందరేమో ట్రైలర్ అదిరిపోయిందని పొగిడేస్తున్నారు.. ఇంకొందరేమో పర్వాలేదు అంటున్నారు.. ఇంకొందరేమో ఏముంది ఇందులో కొత్తదనం అని తేలిగ్గా తీసిపారేస్తున్నారు.. మొత్తానికి ?సర్దార్ గబ్బర్ సింగ్? ట్రైలర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జనాల్లో. ఐతే ముందుగా ప్లాన్ చేసుకున్నారో లేదా ఈ మిక్స్డ్ రెస్పాన్స్ చూశాక ఆలోచన వచ్చిందో కానీ.. ?సర్దార్ గబ్బర్ సింగ్?కు సంబంధించి మరో ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది బాబీ అండ్ టీమ్. ఈ శుక్రవారమే ?సర్దార్? కొత్త ట్రైలర్ జనాల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

?సర్దార్..? ట్రైలర్ అభిమానులకు భలేగా అనిపించి ఉండొచ్చేమో కానీ.. సామాన్య జనాలకు మాత్రం మిశ్రమ అనుభూతిని కలిగించిందన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ కథ - స్క్రీన్ ప్లే అందించాడు కాబట్టి ఇందులో ఏదో కొత్తదనం ఉంటుందనుకున్నారు కానీ.. కథాకథనాలు రొటీన్ గానే ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది. చాలా సినిమాల్లో చూసిన ఫార్మాట్ లోనే ఎంటర్ టైన్ మెంట్-యాక్షన్ మిక్స్ చేసి సినిమా తెరకెక్కించారని అర్థమవుతోంది. ఐతే సినిమా మినిమం గ్యారెంటీ అన్న ఫీలింగ్ కలిగిస్తోంది. ఇక అభిమానులు కోరుకున్నట్లు రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుందా లేదా అన్నది తెరమీద బొమ్మ పడితే కానీ చెప్పలేం. ఇంతకీ తొలి ట్రైలర్ తో పోలిస్తే రెండో ట్రైలర్ ఏం వైవిధ్యం చూపిస్తారో కూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,