Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Aug-2016 16:36:27
facebook Twitter Googleplus
Photo

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున కు మేనల్లుడు సుమంత్ కు పడడం లేదనే వార్తలు ఫిలిం సర్కిల్ లో వినిపించసాగాయి. కానీ తమ మధ్య ఎలాంటి విభేదాలు , గొడవలు లేవని సుమంత్ , నాగార్జున కు సంబదించిన ఓ ఫోటో షేర్ చేసి అభిమానుల అనుమానాలకు తెర దింపాడు.

నాగార్జున పుట్టినరోజు సందర్బంగా సుమంత్ తన చిన్ననాటి ఫోటో ను అభిమానులకు షేర్ చేసాడు. ఈ ఫోటో లో నాగార్జున ,సుమంత్ ను ఎత్తుకొని ఉన్నాడు. అప్పుడు సుమంత్ కు ఏడాది లోపు వయసుండగా తీసిన ఫొటో అది. నాగార్జున కూడా అప్పటికి చిన్నవాడే. ఇప్పటివరకు అభిమానులు చూడని పిక్ అది. ఒక్కసారిగా నాగార్జునను ఆలా చూడడం , అది కూడా పుట్టినరోజు నాడు చూడడం కొత్తగా ఉందని కామెంట్స్ వేస్తున్నారు.

మరోవైపు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన ముఖచిత్రంతో ఒక పోస్టల్ స్టాంపును తపాలా శాఖ విడుదల చేయడం విశేషం. నాగచైతన్య.. అఖిల్ ఈ కార్యక్రమానికి హాజరై ఈ స్టాంపును లాంచ్ చేశారు

,  ,  ,  ,  ,