Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 11:10:42
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ కేరక్టర్ చేసినా.. ఓ ఫ్రేమ్ లో కనిపించినా కెరీర్ లో స్పీడ్ పెరుగుతుందని ఆశించే నటులు చాలామందే ఉంటారు. అన్ని సార్లు కాకపోయినా.. చాలాసార్లు జరిగింది ఇదే కావడంతోనే.. పవన్ మూవీలో చేసేందుకు అంత డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తున్నారు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.

హుషారు అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా.. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఓ ఇంపార్టెంట్ సంగతి ఒకటి తెలిసింది. పవన్ లేటెస్ట్ మూవీలో విలన్ గా నటించేందుకు అజయ్ ను సంప్రదించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో పవన్-ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషీలో.. కేవలం ఒకే సీన్ లో హీరోయిన్ ని ఏడిపించి హీరో బెత్తంతో కొడితే దెబ్బలు తినే రోల్ చేశాడు అజయ్. అలాంటిది ఇప్పుడు మెయిన్ విలన్ గా ఆఫర్ రావడమంటే.. జాక్ పాట్ తగిలినట్లే అని చెప్పాలి.

గత కొంతకాలంగా అజయ్ కి లీడ్ రోల్స్ అంతగా రావడం లేదు. సూర్య మూవీ 24లోను లేటెస్ట్ గా వచ్చిన త్రివిక్రమ్ సినిమా అ..ఆ.. లోను అజయ్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే.. ఇవి చిన్న రోల్స్ మాత్రమే. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పక్కన మెయిన్ విలన్ రోల్.. అది కూడా ఫ్యాక్షనిస్ట్ గా పవన్ తో ఢీ అంటే ఢీ అనే రోల్ రావడంతో.. అజయ్ ఫుల్ 'ఖుషీ' అయిపోతున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,