Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 13:18:00
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే లాంచ్ డేట్‌పై ఓ ప్రకటన వచ్చే సూచన కూడా కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఉదయం అఖిల్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. తన టీమ్‌మేట్‌లోని ఒకరి సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను పోస్ట్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తించండని అఖిల్ అడిగారు.
వీడెవడు? అన్న టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీలుక్‌లో హీరో వెనక్కి తిరిగి ఉండగా, మర్డరర్, ఫైటర్, విలన్, గ్యాంబ్లర్ అంటూ పోస్టర్ నిండా రాతలున్నాయి. అఖిల్ విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఉన్నదెవరని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. హర్షవర్ధన్, సచిన్ జోషి తదితర హీరోల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఫస్ట్‌లుక్‌లో వీడెవడులో ఉన్నదెవరో తేలిపోనుంది.

,  ,  ,  ,