Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:49:34
facebook Twitter Googleplus
Photo

హీరో నాగశౌర్య ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఈ కుర్ర హీరో నటించిన కళ్యాణ వైభోగమే హిట్ కాగా త్వరలో విడుదల కానున్న మెగాడాటర్ నీహారిక లాంఛింగ్ మూవీలో కూడా ఇతడే హీరో. ఈ మూవీపై మంచి అంచనాలు ఉండడంతో పాటు.. చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉండేసరికి.. తలెగరేస్తున్నాడని టాక్.

నిర్మాత - దర్శకులకు కూడా తన తలబిరుసును ప్రదర్శిస్తున్నాడట. దీంతో వాళ్లు ఇచ్చిన అడ్వాన్సులను వెనక్కు తీసేసుకుంటున్నారు. కుమారి 21ఎఫ్ తర్వాత సుకుమార్ రైటింగ్స్ తీయనున్న చిత్రానికి నాగశౌర్యనే హీరోగా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు వేరే హీరో కోసం వెతుకుతున్నారట. ఎన్నారై నిర్మాత రామ్ ఆకెళ్ల అయితే.. ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కు తీసేసుకున్నాడని తెలుస్తోంది.

కళ్యాణ వైభోగమే టైంలో కూడా నిర్మాతకు చుక్కలు చూపించాడట. 25 లక్షలు పోసి నిర్మించిన సెట్ ని.. ఇతడు టైంకి రాకపోవడంతో ఒప్పందం ప్రకారం కూల్చేయాల్సి వచ్చిందట. వీటన్నిటితోపాటు నాగశౌర్యకు 10మంది పర్సనల్ స్టాఫ్ ఉంటారు. వీరందరినీ భరించడం నిర్మాతలకు భారంగా ఉందని అంటున్నారు.

,  ,  ,  ,  ,