Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 12:34:32
facebook Twitter Googleplus
Photo

తన రెండో సినిమాలో అఖిల్ రకరకాల గెటప్పుల్లో కనిపించబోతున్నాడా? ఆయన మాటల్నిబట్టి చూస్తే అదే నిజమనిపిస్తోంది. తొలి చిత్రం అఖిల్లో అక్కినేని చిన్నోడు సాధారణంగానే కనిపించాడు. తొలి సినిమా కాబట్టి తన ఒరిజినల్ లుక్కే సినిమాకి ఎస్సెట్గా భావించారు దర్శకనిర్మాతలు. పైగా ఆ కథలో కూడా గెటప్పులకి అవకాశం లేదు. అందుకే అఖిల్ మామూలుగానే కనిపించాడు. కానీ రెండో సినిమాకి మాత్రం స్టైల్ మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని గెటప్పులేస్తాడో తెలియదు కానీ.. గెటప్పు మాత్రం పక్కాగా మారబోతోంది. ఆ విషయంలో సలహాలు తీసుకోవడానికి ఆయన ఓ హీరోని కూడా వెదుక్కున్నాడు. ఆ హీరో ఎవరో కాదు... సూర్య. మొదట్నుంచీ సూర్య తెరపై రకరకాల గెటప్పులతో కూడిన పాత్రలేస్తూ వస్తున్నాడు. అది అఖిల్ ని బాగా ఆకట్టుకుందట.

ఆ విషయాన్ని నిన్న రాత్రి జరిగిన 24 ఆడియో ఫంక్షన్ లో బయటపెట్టాడు అఖిల్. సూర్యసార్ గెటప్పులంటే నాకు చాలా ఇష్టం. ఆయన తెరపై అదుర్స్ అనిపించేలా కనిపిస్తుంటారు. సినిమా సినిమాకీ కొత్తగా కనిపిస్తుంటారు. ఆ రహస్యం ఏంటో నేనూ అడిగి తెలుసుకుంటా. నా రెండో సినిమాకి గెటప్పుల విషయంలో సూర్యగారి దగ్గరే సలహాలు తీసుకుంటా`` అని చెప్పాడు అఖిల్. సూర్య కూడా షూర్ అంటూ తలూపాడు. దీన్నిబట్టి అఖిల్ రెండో సినిమాలో గెటప్పులు పక్కా అని ఆ విషయంలో సూర్య సలహాలు ఇవ్వడం కూడా పక్కా అర్థమవుతోంది. వంశీ పైడిపల్లితో ప్రస్తుతం అఖిల్ తన రెండో సినిమా గురించి చర్చలు కొనసాగిస్తున్నాడు. మరి అందులో అఖిల్ ఎలా కనిపిస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,