Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 11:49:58
facebook Twitter Googleplus
Photo

దేశభక్తికి సంబంధించిన అంశాల్లో అల్లు అర్జున్ స్పందించే తీరు.. మిగిలిన హీరోలకు విభిన్నంగా ఉంటుంది. కేవలం ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసి ఊరుకోవడంతో సరిపెట్టడు. గతంలో ఓసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. అయాం దట్ ఛేంజ్ అంటూ సుకుమార్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలిం చేశాడు.

అలాగే అభిమానులకు తన చిన్నారిని చూపించేందుకు.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పేందుకు.. తన నెలల చిన్నారి అయిన అల్లు అర్హా తో ఓ సూపర్బ్ ఫోటోను షేర్ చేశాడు అల్లు అర్జున్. తెల్లని దుస్తులు ధరించిన తన చిన్నారిని.. భారత దేశ జెండా పక్కన బజ్జోపెట్టి.. ఆ ఫోటోను పోస్ట్ చేశాడు బన్నీ. జెండా కర్రగా రోల్ చేసిన ఓ తెల్లని వస్త్రం.. మూడు రంగులతో అతి పల్చని వస్త్రాలు.. మధ్యలో నీలం రంగులో కనిపిస్తున్న చిన్నారి క్యాప్.. అ పక్కనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ అల్లు ఆరా కనిపిస్తుంది.

ఇంతకంటే గొప్పగా గణతంత్ర దినోత్సవానికి విషెస్ చెప్పించడం ఎవరి వల్లా కాదేమో అనిపిస్తుంది. రెండు నెలల చిన్నారితో ఇలా దేశభక్తి విషెస్ చెప్పించాలన్న బన్నీ ఐడియా మాత్రం అదిరిందంతే.

,  ,  ,  ,  ,