బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ గా చెప్పుకునే హీరోలలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరని అందరికి తెలిసిందే. అయితే బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీని చూడకుండా ఓ వారమైనా ఉండలేడు. దీంతో అవసరం అయితే వారినే షూటింగ్ స్పాట్ కి పిలిపించుకోని హ్యాపీగా గడుపుతాడు. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు.
ఇక ప్రస్తుతం ఈ స్టయిలిష్ స్టార్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలానే ఉన్నారు. ఇప్పటికే ఫెస్ బుక్ లో 1.27 కోట్ల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న బన్నీ ట్విట్టర్ లో 17 లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ని కూడా మొదలు పెట్టిన ఈ అల్లు హీరో తన ముద్దుల కూతురి ఫొటోని ఫస్ట్ పోస్ట్ చేశాడు. ఇక మంగళవారం కూతురు అర్హ పుట్టిన రోజు కావడంతో ఆమెకు విషెస్ కూడా చెప్పాడు.
అంతే కాకుండా ఓ స్వీట్ కామెంట్ కూడా పెట్టాడు. లిటిల్ ఏంజెల్ హ్యాపీ బర్త్ డే. అప్పుడే ఒక ఏడాది అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా ఉమ్మా' అని లవ్లీగా చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.