Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2015 10:15:44
facebook Twitter Googleplus
Photo

వెండితెరపై వెలుగొందుతోన్న కథానాయకులను కలుసుకోవడాన్ని అభిమానులు తమ అదృష్టంగా భావిస్తుంటారు. అభిమానుల ముందుకి వెళ్లే అవకాశం రావడం కథానాయకులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతిని పొందుతున్నట్టుగా బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఇక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా మలయాళ అనువాదానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఈ నెల 24న ఈ సినిమా మలయాళ అభిమానులను పలకరించనుంది.

గతంలో మలయాళంలో విడుదలైన బన్నీ సినిమాలు అక్కడ ఘనవిజయాలను అందుకున్నాయి. ఆయన సినిమాలకి అక్కడ మార్కెట్ బాగుంటుంది. అందువలన ఈ సినిమా కూడా మలయాళ అభిమానుల ముందుకు వెళుతోంది. ఈ కారణంగా ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించిన కార్యక్రమాల కోసం బన్నీ కేరళ వెళుతున్నాడు. ఈ విధంగా అక్కడి అభిమానులను మరోమారు కలుసుకునే అవకాశం రావడంపట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

,  ,  ,  ,  ,