Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2017 11:47:58
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ ఇప్పుడు ప్రతీ సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. వరుసగా తన సినిమా సక్సెస్ స్థాయిని పెంచుకుంటూ.. ప్రతీ సినిమాకి మినిమం 50-60 కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అనే స్థాయికి వచ్చేశాడు. ఇంత రేంజ్ ఉన్న స్టైలిష్ స్టార్ తో బ్రాండ్ అండార్స్ మెంట్స్ కు కంపెనీలు తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి.

పలు నేషనల్ బ్రాండ్స్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారకర్తగా ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాడ్ క్యాంపెయినర్ గా కూడా మారిపోయాడు. రెడ్ బస్ సంస్థ.. ఇప్పుడు బన్నీని దేశం మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఇప్పటికే ఓ కమర్షియల్ షూట్ చేసేసింది కూడా. ప్రస్తుతం ఈ యాడ్ హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. బస్సులో తన సీట్లో కూర్చుకున్న ఓ మహారాజు గెటప్ లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి పంపేస్తాడు బన్నీ. రెడ్ బస్ యాప్ లో టికెట్ బుక్ చేసుకున్న వాడే రాజు అంటాడు.

యాడ్ కాన్సెప్ట్ మాత్రమే కాదు.. బన్నీ స్టైలింగ్ కూడా అదిరిపోయింది. సాయాజీ షిండే లాంటి కేరక్టర్ ఆర్టిస్ట్ ను కూడా చేర్చడంతో.. క్యాస్టింగ్ రిచ్ గా ఉంది. అయితే.. అల్లు అర్జున్ చేతికి వరుసగా ప్రెస్టీజియస్ బ్రాండ్స్ అన్నీ వస్తుండడం ఒక విశేషం. అయితే.. అభిబస్ కు మహేష్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,