Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2017 16:11:14
facebook Twitter Googleplus
Photo

ఫ్యామిలిలో నటన అండ్ డ్యాన్స్ పరంగా అన్ని కోణాల్లో సత్త చాటగల హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. నటనలోనే కాకుండా డ్యాన్స్- ఫైట్స్- డైలాగ్స్ ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్రాల ఎంపికలో కూడా బన్నీ చాలా శ్రద్ధ వహిస్తాడనేది ఇప్పటివరకు అతను ఎంచుకున్న సినిమాలే చెబుతాయి. అయితే హీరోకు అన్నిటికన్నా ముఖ్యమైన ఫిట్ నెస్ విషయంలోను బన్నీ కెరీర్ మొదటి నుంచే
జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు.

ఇక ప్రతి సినిమాలో నటనాపరంగా కొంత డిఫరెంట్ గా కనిపించిన బన్నీ చాలా రోజుల తర్వాత సినిమాలోని పాత్ర కోసం తన బాడీని కొత్తగా చూపెట్టబోతున్నాడట. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ మొదటి సారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య సినిమాలోని పాత్ర కోసం అల్లు అర్జున్ ఒక దేశ సైనికుడిగా కనిపించనున్నాడు. అయితే అప్పుడెప్పుడో బన్నీ- దేశముదురు సినిమాలకోసం ఫిట్ గా కనిపించడానికి చాలా ట్రై చేశాడు. ఆ తర్వాత ఇంకాస్త దృడంగా కనిపించినా పాత్ర కోసం ప్రత్యేకంగా బాడీనీ మలచలేదు. ఇక మళ్లీ చాలారోజుల తర్వాత నా పేరు సూర్య కోసం మరో స్టైల్ లో ఫిట్ గా కనిపించబోతున్నాడట. అందుకు విదేశాలనుంచి ఒక స్పెషల్ ట్రైనర్ కూడా వచ్చాడని వార్తలు వినిపించాయి.

అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో కొత్తగా ఉంటాడని రీసెంట్ గా కమెడియన్ వెన్నల కిషోర్ చెప్పాడు. అతను ఈ సినిమాలో ఓ పాత్ర చేయబోతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ ఈ కమెడియన్.. బన్నీ పవర్ ఫుల్ గా ఉంటాడని కూడా చెబుతున్నాడు. అసలైతే ఫస్ట్ లుక్ ఆగష్టు 15 కే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్ కి ఫిక్స్ అవ్వడంతో.. అప్పుడే చూపించేస్తే బాగోదని అనుకున్నారట.

,  ,  ,  ,  ,