Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2017 14:53:05
facebook Twitter Googleplus
Photo

ఆ మధ్యన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్టిచ్చి ఇప్పుడు ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన విఐ ఆనంద్ డైరక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం మనోడు సినిమా వివరాలను ఏమీ చెప్పలేదు కాని.. తాను మాత్రం వైజాగ్ లో ఛిల్లింగ్ అంటూ తెలిపాడు.

వైజాగ్ లోని ఒక రీసార్టులో కూర్చుని.. చక్కగా డీటాక్స్ అవుతున్నాడట ఈ యంగ్ హీరో. ఆ సముద్రాన్ని అలా చూస్తూ.. రిసార్టులో సేదతీరుతూ.. కాలం గడుపుతుంటే హాయిగా ఉందంటున్నాడు. సాధరణంగా అందరూ బ్యాంకాక్ గట్రా వెళ్తుంటారు ఇలాంటి డిటాక్స్ కార్యక్రమాలకు. కాని అల్లు శిరీష్ మాత్రం వైజాగ్ లోనే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూస్తుంటే అల్లు అరవింద్ గారికి మనోడు డబ్బులు బాగా సేవింగ్ చేస్తున్నట్లే అనిపిస్తోంది కదూ.

ఇకపోతే మనోడు ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలను చేస్తున్నప్పటికీ.. అసలు బాక్సాఫీస్ దగ్గర డిపెండబుల్ స్టార్ గా ఇంకా ఎదగాల్సి ఉంది.

,  ,  ,  ,