Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2015 19:11:19
facebook Twitter Googleplus
Photo

ఆట పాటల్లో దేనికైనా సరైనోడు అల్లు అర్జున్. కొత్తదనం చూపించడానికి - కొత్త స్టైల్స్ - స్టెప్స్ పరిచయం చేయడానికి బన్నీ ఎప్పుడూ ముందుంటాడు. అల్లు అర్జున్ తప్ప ఇంకెవరూ చేయలేర్రా అనిపించే రేంజ్ లో అదరగొట్టడం మనోడి స్టయిల్. అందుకే ఈ సరైనోడు.. కొత్త సినిమాలో కూడా అదరగొట్టేస్తున్నాడు. జోరుకి హుషారుకు మారు పేరులా ఉండడంతో వీడు దేనికైనా సరైనోడురా అంటారు అతని స్నేహితులు.

ఇదీ కొత్త సినిమా సరైనోడులో బన్నీ కేరక్టర్. ఇప్పుడా మూవీకి సంబంధించిన సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అందులోనూ ఓ శుభకార్యానికి సంబంధించిన మండపం - హడావిడి - చుట్టాలు - పక్కాలు - బంధువులు.. అబ్బో పెద్ద పెద్ద సెట్ల మధ్యలో.. బన్నీ మహా హుషారు మీదున్నాడు. అందుకే డ్యాన్సులేస్తూ.. ఓ పాట పాడేసుకుంటున్నాడు. స్పీడ్ కి మనిషి రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి.. బన్నీ స్టెప్స్. మరి అలాంటి డ్యాన్స్ చూస్తూ.. చుట్టూతా ఉన్నవాళ్లు కూడా కాలు కలిపారు. అంతే సందడి మరింతగా పెరిగిపోయింది.

అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పాట ఇది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ - సాయికుమార్ సహా ప్రధాన తారగణమంతా ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీకి అల్లు అరవింద్ నిర్మాత.

,  ,  ,  ,