Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2016 12:54:27
facebook Twitter Googleplus
Photo

నితిన్ - సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ.. చిత్రం ఆడియో విడుదల వేడుక జరుపుకుని ఓ వారం గడుస్తోంది. మాటల మాంత్రికుడి మూవీ కావడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో చాలానే అంచనాలు ఉన్నాయి. నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచే అవకాశాలు ఉండడంతో.. బయ్యర్లు కూడా అ..ఆ.. కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

థియేట్రికల్ ట్రైలర్ విడుదల తర్వాత అ..ఆ.. పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదల డేట్ ఎప్పుడా అని ఫ్యాన్స్ కూడా గమనిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇన్నాళ్లు బ్రహ్మోత్సవం విడుదల డేట్ ప్రకారం అ..ఆ.. ను విడుదల చేస్తారని అన్నారు. ఇప్పుడు మహేష్ బాబు స్వయంగా తన సినిమా రిలీజ్ డేట్ మే 20 అని చెప్పేశాడు. దీంతో అ..ఆ.. కు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.

జూన్ మొదటివారంలో అ..ఆ.. విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నా.. ఈ డేట్ పై ఇండస్ట్రీ జనాలే చాలా సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అప్పటికి మరోవారంలో స్కూల్స్ స్టార్ట్ అవనుండడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారన్నది వాళ్ల లెక్క. అలా కాకూడదంటే మే 27కే వచ్చేయాలి. అప్పుడు బ్రహ్మోత్సవంపై ఎఫెక్ట్ పడుతుంది. లేట్ చేస్తే తమ సినిమాకే నష్టం జరుగుతుంది. ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన చిత్రాన్ని మరో నెలన్నర వాయిదా వేసుకునే ఛాన్స్ లేదు. అందుకే విడుదల తేదీ విషయంలో అ..ఆ.. టీం త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,