Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:42:28
facebook Twitter Googleplus
Photo

హాట్ యాంకర్ అనసూయ.. టీవీ నుంచి సినిమా రంగానికి గతంలోనే అప్ గ్రేడ్ అయింది కానీ.. రీసెంట్ గానే ఐటెం సాంగ్ చేసేందుకు కూడా అంగీకరించింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పక్కన ఐటెం గాళ్ చేయమంటే నో చెప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తో విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ చేయబోతోంది.

ప్రస్తుతం అనసూయ నటిస్తున్న పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాకపోతే.. ఈ షూటింగ్ ఇండియాలో కాదు.. ఉక్రెయిన్ లో పిక్చరైజ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ లో తేజుతో చిందులేస్తూ.. ఖాళీ టైమ్ లో అక్కడి ప్రకృతి అందాల చుట్టూ చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేసేస్తోంది అనసూయ. మొదటి సారి ఉక్రెయిన్ చూస్తున్నానని.. బ్యూటిఫుల్ ప్లేస్ లో షూటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన అనసూయ.. వెజిటేరియన్ ఫుడ్ తింటున్నా అంటూ ఫోటోలు కూడా తీసి పోస్ట్ చేసింది.

ఉక్రెయిన్ వెళ్లి మరీ నాన్ వెజ్ పాటలో నటిస్తూ.. వెజిటేరియన్ తింటోందంటే.. అదంతా కార్తీక మాసం ప్రభావం అనేసుకోవచ్చు. అది సరే కానీ.. ఐటెం పాటలో ఎలా కనిపించనుందో ఓ లుక్ ఇచ్చేస్తే.. అభిమానులు ధన్యులు అయిపోతారు కదా అనసూయా!

,  ,  ,  ,  ,  ,