Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 10:54:28
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్ జంట కూడా ఉంటుంది. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అనూహ్య విజయాలు సాధించడం.. రియల్ లైఫ్ లో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే టాక్ ఉండడం.. ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ ఏ మాత్రం బింకం లేకుండా పండించేయగలగడంతో ఈ యువ జంట సినిమాలకు క్రేజ్ ఎక్కువే.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ అంధగాడు. ఇప్పటికే షూటింగ్ తో పాటు దాదాపు అన్ని పనులు పూర్తయిపోయిన ఈ చిత్రాన్ని.. సమ్మర్ స్పెషల్ గా మే 26న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పుడీ అంధగాడిని మరో వారం వెనక్కు నెట్టి జూన్ 2ను ఫిక్స్ చేసుకున్నారు. ఇది కచ్చితంగా నాగ చైతన్య- రకుల్ ప్రీత్ ల మూవీ రా రండోయ్ వేడుక చూద్దాంకు మేలు చేసే విషయమే. మరోవైపు అంధగాడు మూవీతో దర్శకుడిగా మారుతున్నాడు రైటర్ వెలిగొండ శ్రీనివాస్. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో.. రాజ్ తరుణ్ కొంత సేపు గుడ్డివాడి గాను.. కొంతసేపు మామూలుగాను కనిపిస్తాడు. ప్రమోషన్స్ మరింత అగ్రెసివ్ గా చేసుకునేందుకే ఓ వారం వెనక్కి వెళ్లినట్లు నిర్మాతలు చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,