Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:48:39
facebook Twitter Googleplus
Photo

స్లిమ్ గా కనిపించడం కోసం అంజలి కసరత్తును మొదలుపెట్టింది. సహజంగానే కాస్త బొద్దుగా కనిపించే అంజలి, ఆ మధ్య వచ్చిన గ్యాప్ తో మరికాస్త లావుగా తయారైంది. ఈ సమయంలోనే ఆమెకి బాలకృష్ణ 99 వ చిత్రమైన 'డిక్టేటర్' సినిమాలో నటించే ఛాన్స్ తగిలింది. బాలకృష్ణ జోడీగా అవకాశం లభించడం అంతతేలిక కాదు. పైగా ఆయన ఈ సినిమాలో న్యూ లుక్ తో కనిపించనున్నాడు.

అందువలన అంజలి కూడా కాస్తంత స్లిమ్ గా మారితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ వుండటంతో, ఆమె ఆ దిశగా కృషి చేస్తోందట. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలి చాలా స్లిమ్ గా .. స్టైలిష్ లుక్ తో దర్శనమిస్తుందన్న మాట. శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,