Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2016 11:45:25
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా విషయంలో కొద్దికాలంగా అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. పవన్ కొత్త సినిమాకు దర్శకత్వం వహించాల్సిన ఎస్.జె.సూర్య చివరి నిమిషంలో తాను నటిస్తోన్న సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత వెంటనే దర్శకుడు డాలీని ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసేసి టీమ్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను మళ్ళీ వేగవంతం చేసేసింది.
కాగా తాజాగా మళ్ళీ ఈ సినిమాపై పుకార్లు మొదలయ్యాయి. డాలీ దర్శకత్వంలోనూ సినిమా తెరకెక్కదని, ఇక ఈ ప్రాజెక్టు దాదాపుగా ఆగిపోయినట్లేనని గత కొద్ది రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత శరత్ మరార్ సినిమా ఆగిపోలేదని చెప్పినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఉదయం పవన్‌ను కలిశాక, పవన్ లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫామ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడే తన కొత్త సినిమా స్క్రిప్ట్‌ పనులు చూసుకుంటున్నారని శరత్ స్పష్టం చేశారు. దీంతో పవన్ సినిమా ఆగిపోలేదని మరోసారి స్పష్టమైపోయింది.

,  ,  ,  ,  ,  ,  ,