Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 12:14:35
facebook Twitter Googleplus
Photo

అఆ.. ప్రేమమ్.. శతమానం భవతి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ ఊపులో పెద్ద పెద్ద అవకాశాలు ఆమె తలుపు తట్టినట్లు వార్తలొచ్చాయి. రామ్ చరణ్.. ఎన్టీఆర్ సినిమాల్లో ఆమెను కథానాయికగా ఎంచుకున్నట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ వార్తలు నిజం కాలేదు. రామ్ చరణ్ తో సినిమాను స్వయంగా అనుపమే కన్ఫమ్ చేసింది ఒక టైంలో. కానీ చిత్రం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ సినిమాలోనూ ఆమెను లీడ్ రోల్ కు తీసుకున్నట్లే తీసుకుని తర్వాత తప్పించినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఐతే రామ్ చరణ్ సినిమా కొన్ని కారణాల వల్ల తప్పిందని.. ఎన్టీఆర్ సినిమాకు తనను అడగనే లేదని అనుపమ స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ సినిమాకు నన్ను ముందు ఎంపిక చేసి తర్వాత తప్పించారన్న వార్త అబద్ధం. అసలు ఆ యూనిట్ వాళ్లు నన్ను సంప్రదించనే లేదు. ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకు నేను కథానాయికగా దాదాపుగా కన్ఫమ్ అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఆ అవకాశం దక్కలేదు. ఐతే అవకాశాలిస్తే మంచి వాళ్లు.. లేదంటే చెడ్డ వాళ్లు అనుకునే రకం కాదు నేను. ఆ చిత్ర యూనిట్ వాళ్లతో నాకు మంచి రిలేషన్ ఉంది. రామ్ చరణ్ మంచి వ్యక్తి. అతడితో భవిష్యత్తులో పని చేస్తానని అనుకుంటున్నా. అయినా నా వయసు 21 ఏళ్లు మాత్రమే. నాకు చాలా భవిష్యత్తు ఉంది. మున్ముందు అందరితోనూ పని చేసే అవకాశం దక్కుతుందని అనుకుంటున్నా

,  ,  ,  ,  ,  ,