Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2017 15:49:14
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ రేపుతోన్న సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా అర్జున్ రెడ్డి కలెక్షన్ల అరాచకం కొనసాగుతోంది. అక్కడ రెండో వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు. తాజాగా విడుదలైన పైసా వసూల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అర్జున్ రెడ్డి కలెక్షన్ల రేసులో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా 1.5 మిలియన్ మార్క్ ను దాటి 2 మిలియన్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతోంది. నాని నటించిన భలే భలే మగాడివోయ్ రికార్డులను అర్జున్ రెడ్డి బ్రేక్ చేసింది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన తెలుగు చిత్రాల జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన భారతీయ చిత్రాల జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ జాలీ ఎల్ ఎల్ బీ 2 - టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాల రికార్డులను ఈ వారం బద్దలు కొట్టే అవకాశముంది.

ఆల్ టైం టాప్ గ్రాసర్స్

బాహుబలి 2 (2017) $20571695

బాహుబలి (2015) $6999312

శ్రీమంతుడు (2015) $2890786

అ ఆ... (2016) $2449174

ఖైదీ నెం.150 (2017) $2447043

ఫిదా (2017) $2066937

నాన్నకు ప్రేమతో (2016) $2022392

అత్తారింటికి దారేది (2013) $1897541

జనతా గ్యారేజ్ (2016) $1800404

గౌతమి పుత్ర శాతకర్ణి (2017) $1662775

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) $1635300

ఊపిరి (2016) $1569162

దూకుడు (2011) $1563466

మనం (2014) $1538515

అర్జున్ రెడ్డి (2017) $1513353

ఆగడు (2014) $1482435

ధ్రువ (2016) $1472969

భలే భలే మగాడివోయ్ (2015) $1430026

రేసు గుర్రం (2014) $1394655

1 నేనొక్కడినే (2014) $1330155

బాద్షాహ్ (2013) $1278610

S/O సత్యమూర్తి (2015) $1250000

పెళ్లి చూపులు (2016) $1222644

కాటమరాయుడు (2017) $1162059

బ్రహ్మోత్సవం (2016) $1157978

నిన్నుకోరి (2017) $1153085

దువ్వాడ జగన్నాథం (2017) $1148686

నేను లోకల్ (2017) $1196559

ఈగ (2012) $1071281

సర్దార్ గబ్బర్ సింగ్ (2016) $1070404

టెంపర్ (2015) $1052650

గబ్బర్ సింగ్ (2012) $1034484

2017: అమెరికాలో ఇండియన్ టాప్ సినిమాలు

బాహుబలి 2 - $20571695

రయీస్ - $3633008

ఖైదీ నెం.150 - $2447043

ఫిదా - $2066937

బద్రినాథ్ కీ దుల్హనియా - $1975957

జబ్ హ్యారీ మెట్ సెజల్ - $1935567

జాలీ ఎల్ ఎల్ బీ 2 - 1687530

టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ - $1663338

గౌతమి పుత్ర శాతకర్ణి - $1662775

ట్యూబ్ లైట్ - $1576244

అర్జున్ రెడ్డి - $1513353

,  ,  ,  ,  ,